మెగాస్టార్ చిరంజీవి కరోనా సోకినట్లు ప్రకటించారు.. అంతలోనే అది ఫాల్స్ పాజిటివ్ అని అనౌన్స్ చేసేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మూడు నాలుగు రోజులపాటు టెన్షన్ పడ్డారు, అభిమానుల్నీ టెన్షన్ పెట్టేశారు. ఎలాగైతేనేం, ఇప్పుడంతా ఊపిరి పీల్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని సెట్స్‌లో చూడాలని వుందంటూ కొరటాల శివ సహా ‘ఆచార్య’ బృందమంతా ఎదురుచూస్తోంది.
అయితే, వెంటనే చిరంజీవి ‘ఆచార్య’ సెట్స్‌లో జాయిన్ అవకపోవచ్చనీ, ఓ వారం రోజులు రెస్ట్ తీసుకునే అవకాశం వుందనీ ప్రచారం జరుగుతోంది. కరోనా పాజిటివ్ అని తేలాక, సంబంధిత మందులు వాడారు చిరంజీవి. ఆ తర్వాత రకరకాల టెస్టులూ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో కాస్త అలసటకు గురయ్యారట చిరంజీవి. కరోనా అంటేనే, మానసిక ఒత్తిడి.. కరోనా లేకపోయినా, ఆ ఒత్తిడిని చిరంజీవి భరించాల్సి వచ్చింది. చిరంజీవి అంటేనే పెర్‌ఫెక్షన్.. దాంతో, పూర్తిస్థాయి ఎనర్జీని సంతరించుకుని, కెమెరా ముందు ఆ మొత్తం ఎనర్జీని చూపించేయాలన్న తపనతో వున్నారట చిరంజీవి.
మరోపక్క, ‘ఆచార్య’ బృందం షూటింగ్‌ని పునఃప్రారంభించేసింది. చిరంజీవి జాయిన్ అయ్యేలోపు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిపోనుంది. చిరంజీవి వచ్చాక, జెట్ స్పీడ్‌తో షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనతో వుందట ఆచార్య బృందం. మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోన్న విషయం విదితమే. కాజల్ అగర్వాల్ హీరోయిన్.