అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, ఈపాటికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసేదే. చాలా చాలా కారణాలతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. సంక్రాంతికి ప్లాన్ చేశారుగానీ, కరోనా వచ్చి పడింది. సమ్మర్‌లోకూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. అసలు 2021లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదలవుతుందా.? లేదా.? అన్నదానిపై ఆసక్తికరమైన చర్చ అటు సినీ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ జరుగుతోంది. అంచనాల పరంగా చూసుకుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే, అక్కడ ఒకటి కాదు రెండు కాదు, మూడు ‘ఆర్’లు వున్నాయి.
రాజమౌళి, రాంచరణ్, రామారావు (ఎన్టీఆర్) వున్నారాయె. అయినాగానీ, అభిమానుల్లో ఆందోళన తగ్గడంలేదు. ఇదిలా వుంటే, ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీం దీపావళి సర్‌ప్రైజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని స్టిల్స్ విడుదల చేసింది. వాటిల్లో ఎన్టీఆర్, రాంచరణ్, దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా కనిపించారు. ఈ స్టిల్స్ అభిమానుల్ని అలరిస్తున్నాయి. అయితే, చరణ్ కాలికి బ్యాండేజ్‌తో కనిపిస్తున్నాడు.
ఓ కాలి పాదానికి బ్యాండేజ్ వేసి వుంది. గతంలోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ సమయంలోనే చరణ్ గాయపడ్డాడు. అప్పుడూ ఇలాంటి బ్యాండేజీతోనే చరణ్‌ని చూశాం. దాంతో, అభిమానుల్లో టెన్షన్ మళ్ళీ మొదలయ్యింది. కాగా, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా కోసం అలియా భట్ రంగంలోకి దిగాల్సి వుంది. ఒలీవియా మోరిస్ (విదేశీ నటి), ఇండియాకి పయనమవుతున్నట్లు ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం విదితమే.