చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ ఆచార్య. తొలిరోజే ఓపెనింగ్స్ లేకపోవడం చిరు డై హార్డ్ ఫ్యాన్స్‌ని సైతం ఆశ్చర్యపరిచింది. ఆచార్యకు ఓపెనింగ్స్ రాకపోవడానికి బోలెడన్ని కారణాలు. ఆ సినిమాకి ఎలాంటి బజ్ లేదు. పైగా.. టికెట్ రేట్లు అనూహ్యంగా పెంచేశారు. చిరంజీవి సినిమా కదా, జనాలు వస్తారులే అనుకొన్ని... రూ.150 టికెట్ ని రూ.250 చేసేశారు. దాంతో ప్రేక్షకులు హ్యాండ్ ఇచ్చారు. చిరంజీవి సినిమాకి మినిమం ఓపెనింగ్స్ లేకపోవడానికి అదో పెద్ద కారణం.
అయితే ఆ తప్పుని `గాడ్ ఫాదర్` సరిద్దుకొన్నాడు. ఈనెల 5న దసరా సందర్భంగా `గాడ్ ఫాదర్` విడుదల అవుతోంది. ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించారు. హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లో రూ.150 కే ఈ సినిమా టికెట్ అందుబాటులో ఉంచారు. పండగ సీజన్. సినిమాకి వెళ్లాలంటే కుటుంబం మొత్తం కదిలి వస్తుంది. అందుకే అందరికీ టికెట్ రేటు అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయం తీసుకొన్నారు. బీ, సీ సెంటర్లలోనూ టికెట్ రేట్లు తగ్గబోతున్నాయి. ఈ దసరాకి `గాడ్ ఫాదర్`తో పాటుగా `ఘోస్ట్` కూడా విడుదల అవుతోంది. కాబట్టి.. కాంపిటీషన్ ఉన్నట్టే. ఆ కాంపిటీషన్‌ని తట్టుకోవడానికే టికెట్ రేటు ఇలా తగ్గించాల్సివచ్చింది.