మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా ఆల్రెడీ సెట్స్ మీద వుంది. అదే ‘ఆచార్య’. ఇంకో రెండు సినిమాల్ని చిరంజీవి ఇప్పటికే ప్రకటించేశారు. వాటిల్లో ఒకటి ‘లూసిఫర్’ కాగా, మరొకటి ‘వేదాలం’ రీమేక్. వీటిల్లో ‘వేదాలం’ సినిమా కోసం చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించేందుకు సాయి పల్లవిని ఒప్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ‘వేదాలం’ సినిమాలో చెల్లెలి పాత్రకి చాలా ప్రాధాన్యత వుంది. అందుకే, ఆ పాత్ర కోసం రికార్డు స్థాయి రెమ్యనరేషన్ కూడా ఆపర్ చేశారంటూ గుసగుసలు వినిపించిన సంగతి తెల్సిందే.
తాజాగా, ఇప్పడు ఇంకో చెల్లలి పాత్ర కోసమంటూ మరో హీరోయిన్ పేరు తెరపైకొచ్చింది. ఆ పేరు ఇంకెవరిదో కాదు, నయనతారది. కానీ, ఆరా తీస్తే అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఇంకోపక్క, వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. వీరిద్దరూ కాదు, ఓ బాలీవుడ్ నటిని తీసుకు రాబోతున్నారంటూ ఇంకో గుసగుస చక్కర్లు కొడుతోంది టాలీవుడ్‌లో. కొందరైతే ఏకంగా విజయశాంతి పేరుని ప్రస్తావిస్తున్నారు.
చిరంజీవి సినిమా అంటే ఆ కిక్కు అలాగే వుంటుంది మరి. ప్రస్తుతానికైతే చిరంజీవి ‘ఆచార్య’ పూర్తి చేయడం మీదనే పూర్తి ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాతే ఆయన తన తదుపరి సినిమాలకు సంబంధించి స్టార్ కాస్టింగ్ మీద ఫోకస్ పెట్టే అవకాశం వుందని అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.