కరోనా పుణ్యమా అని... ఈ సమ్మర్ సీజన్ మట్టికొట్టుకుపోయింది. ఈ వేసవిలో రావాల్సిన పెద్ద సినిమాలన్నీ మూకుమ్ముడిగా వాయిదా పడ్డాయి. అందులో మెగాస్టార్ `ఆచార్య` ఒకటి. మే 13న రావాల్సిన సినిమా ఇది. అయితే... కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేయాల్సివస్తోంది. అయితే `ఆచార్య` తదుపరి డేట్ ఎప్పుడన్నదానిపై ఇప్పటికి ఎలాంటి స్పష్టతా లేదు. మే కాకపోతే.. జూన్, జూన్ కాకపోతే... జులై అని సర్దుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే `ఆచార్య` షూటింగ్ ఇంకా బాకీ వుంది. అదెప్పుడు పూర్తవుతుందో చెప్పలేరు.
అందుకే కొరటాల కూడా రిలీజ్‌డేట్ టార్గెట్ పెట్టుకుని, టెన్షన్ తెచ్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎలాగూ లేట్ అయ్యింది కదా... అని తీరిగ్గా సినిమా పూర్తి చేసి తీసుకొద్దామనుకుంటున్నాడు. ఇప్పటికైతే.. ఆగస్టు 22న ఈ సినిమాని విడుదల చేయాలని ఫిక్సయ్యార్ట. అది చిరు పుట్టిన రోజు. కాబట్టి.. మెగా ఫ్యాన్స్ కి గిఫ్టుగా ఇచ్చినట్టు ఉంటుంది. కాకపోతే... మేలో అనుకున్న సినిమా ఆగస్టు అంటే.. మూడు నెలలు లేటన్నమాట. ఇంత ఆలస్యాన్ని మెగా ఫ్యాన్స్ భరిస్తారా?