చిరంజీవి సినిమా అంటే.. ఆ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. పైగా.. కొరటాల శివకు వరుసగా అన్నీ విజయాలు. ఒకదాన్ని మించి మరో హిట్టు. దాంతో.. సహజంగానే `ఆచార్య`పై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే బిజినెస్ విషయంలో దుమ్ము దులుపుతోంది ఈసినిమా. అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయిపోయింది. శాటిలైట్ హక్కులు అమ్మాల్సివుంది.
అయితే... శాటిలైట్ కోసం ఏకంగా 80కోట్లు డిమాండ్ చేస్తున్నార్ట నిర్మాతలు. అంత మొత్తంలో ఈ సినిమా హక్కుల్ని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కనీసం 60 కోట్లకు అమ్ముడైనా.. అది రికార్డు ధరే. బాహుబలి తప్ప.. ఏ సినిమాకీ ఈ స్థాయి ధరకు అమ్ముడు కాలేదు. చిరు గత చిత్రాలకూ ఈ రేటు రాలేదు.
నిర్మాతలు మరీ అత్యాశకు పోతున్నారని, ఇంతింత పెద్ద రేట్ పెట్టి, శాటిలైట్ ఇప్పుడు ఎవరూ కొనడం లేదని, ఓటీటీలు వచ్చాక టీవీల్లో సినిమా చూడడం బాగా తగ్గిపోయిందని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి.. ఆచార్య నిర్మాతల వ్యూహం ఏమిటో?