చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ చిత్రానికి యాక్షన్ ఘట్టాలు అత్యంత కీలకం. ఎంత కీలకం అంటే స్వతంత్రోద్యమ కాలం నాటి పరిస్థితుల్ని ఆ యాక్షన్ సన్నివేశాల్లో ప్రతిబింబించాలి. అది కూడా డ్రమటిక్ యాక్షన్‌లా కాకుండా రియల్ పోరాట ఘట్టాల్లా కనిపించాలి. అందుకోసం చిత్ర యూనిట్ చాలా కసరత్తులు చేస్తోందట.
ఈ యాక్షన్ ఘట్టాలను రియలిస్టిక్‌గా తెరకెక్కించేందుకు ప్రత్యేకంగా పరిశోధనలు చేసిందట చిత్ర యూనిట్. మామూలుగానే యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించడంలో ధిట్ట డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అలాంటిది ఇక ఇలాంటి హిస్టారికల్ మూవీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటాడు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి సినిమా. ఎంతో ప్రతిష్ఠాత్మక చిత్రం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం చిరంజీవి ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారట. అయితే చిరంజీవికి ఇలాంటి యాక్షన్స్ కొత్తేమీ కాదు. అయినా సరే తెలుగు తెరపై ఇంతకు ముందెన్నడూ లేనంత గ్రాండ్‌గా రియలిస్టిక్‌గా ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ ఉండేందుకు చిత్ర యూనిట్ తమ వంతు కృషి చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. యాక్షన్ ఘట్టాలతోనే సినిమాని స్టార్ట్ చేయనున్నారనీ సమాచారమ్.