హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారని, పోలీస్ స్టేషన్ కు తరలించారనే వార్తలు సంచలనంగా మారాయి. అయితే అసలైన సమాచారం ప్రకారం.. ఆయన్ని అరెస్ట్ చేయలేదు, కేవలం ఎంక్వరీ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళుతున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో ఆయన్ను ఎంక్వరీకి పిలిచారు.
పుష్ప2 సినిమా రిలీజ్ ముందు రోజు రాత్రి వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు. ఈ ఘటనలో రేవతి మృతిచెందారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం ఆయన్ని ఎంక్వరీకి పిలిచారు.