హీరో చియాన్ విక్రమ్ గుండెపోటుతో హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయనకి కావేరీ హాస్పిటల్ ఐసియూలో చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే విక్రమ్ కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు గుండెపోటు రావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
నేడు విక్రమ్ నటించిన పొన్నియన్ సెల్వన్ టీజర్ లాంచ్ జరుగుతున్న విషయం తెల్సిందే. సాయంత్రం 6 గంటలకు విక్రమ్ ఈ ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉండగా.. ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆయన ఆరోగ్యంపై హాస్పిటల్ వర్గాలు స్పందించాల్సి వుంది.