నటి భావన కిడ్నాప్ విషయంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదురుకుంటున్న హీరో దిలీప్ కి కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
ఇప్పటికే ఒకసారి బెయిల్ కోసం కొచ్చి హైకోర్టుని ఆశ్రయించగా ఆ పిటీషన్ తిరస్కరణకి గురయింది. ఇక ఈరోజు మరోసారి దాఖలు చేయగా, కోర్టు విచారణ జరిపి దిలీప్ పైన అభియోగాలు తీవ్రంగా ఉండడంతో ఆయనకీ బెయిల్ ఇవ్వడం కుదరదు అని తేల్చిచెప్పింది.
దీనితో వరుసగా బెయిల్ తిరస్కరనలకు గురవ్వడం దిలీప్ వంతయింది. ఇక కేరళ పోలీసులు ఈ కేసులో దిలీప్ సారధ్యంలోనే కుట్ర జరిగిందని అలా అని తమ వద్ద ఆధారాలు ఉన్నాయి అని స్పష్టం చేస్తున్నారు.