డ్రగ్స్ కేసు విచారణ ఒక కీలక మలుపు తిరిగింది. SIT విచారాణ జరుగుతున్న తీరు పై చార్మీ తనకి అనుమానాలు ఉన్నాయంటూ హై కోర్టుని ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే, విచారాణకి హాజరయిన వారి నుండి బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ళు సేకరిస్తున్నారు అంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అలాగే తనతో పాటు తన న్యాయవాదిని విచారణ జరిగే సమయంలో అనుమతించాలి అంటూ హైకోర్టుని కోరింది.
ఇక చార్మీ ఈ నెల 26వ తేదీన SIT ముందు విచారణకి రావాల్సివుంది. ఇటువంటి తరుణంలో చార్మీ వేసిన పిటీషన్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆబ్కారీ శాఖ ఆఫీసులో హీరో నవదీప్ విచారణ కొనసాగుతున్నది.