ధర్మచక్రం, శంకర్ దాదా ఎంబీబీఎస్, ప్రేమికుడు, ఆనంద భైరవి, రక్షకుడు తదితర చిత్రాలలో నటించిన గిరీష్ కర్నాడ్ (81) ఇక లేరు. ఈ రోజు ఉదయం ఆయన బెంగళూరులో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1938 మేలో మహారాష్ట్రలో జన్మించిన గిరీష్ రచయితగా, కవిగా సుప్రసిద్ధుడు. నాటక రంగంలోనూ విశేషమైన అనుభవం గడించారు. 1998లో సాహిత్య రంగంలో విశిష్టమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా, కీలకమైన పాత్రలు దక్కాయి. శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో చిరంజీవికి, ధర్మచక్రంలో వెంకటేష్‌కి తండ్రిగా నటించారు. శంకర్ దాదాలో ఆయన పాత్ర ఎంత సున్నితంగా ఉంటుందో, ధర్మచక్రంలో అంత క్రూరంగా ఉంటుంది. నటుడిగా ఆయన విశిష్టత అదే. గిరీష్ కర్నాడ్ మృతి సినిమా రంగానికే కాదు, సాహితీ రంగానికీ తీరని లోటు.