'చాణిక్య‌'గా మారుతున్న గోపీచంద్‌

మరిన్ని వార్తలు

యాక్ష‌న్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న‌వాళ్ల‌లో గోపీచంద్ ఒక‌డు. అయితే ఈ మ‌ధ్య స‌రైన విజ‌యాల్లేక అల్లాడుతున్నాడు. మ‌ళ్లీ ఫామ్‌లోకి రావ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా తిరు ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సంద‌ర్భంలోనే గోపీచంద్ గాయ‌ప‌డ్డాడు. ఇప్పుడు ఆ గాయం నుంచి కోలుకుని షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు.

 

ఈ చిత్రానికి టైటిల్ కూడా దాదాపుగా ఖ‌రారైంది. ఈ చిత్రానికి `చాణ‌క్య‌` అనే పేరు పెట్టార‌ని టాక్‌. అధికారిక ప్ర‌క‌ట‌న ఒక‌ట్రెండు రోజుల్లో వ‌చ్చేస్తుంది. ఇదో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. క‌థ‌లో మ‌లుపులు, ఎత్తుగ‌డ‌లు చాలా ఉంటాయి. దానికి త‌గ్గ‌ట్టే ఈ పేరు ఖ‌రారు చేశార‌ని తెలుస్తోంది. ఈ యేడాది చివ‌ర్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS