సూపర్‌ హీరోగా మారిన ఆ తమిళ హీరో!

By iQlikMovies - June 21, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

సూపర్‌ హీరోస్‌ సినిమాలంటే ఇప్పుడే ఎప్పుడూ ఒకప్పుడూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నవే. అంతెందుకు ఇటీవల రిలీజైన హాలీవుడ్‌ మూవీ 'అవెంజర్స్‌ ది ఎండ్‌ గేమ్‌' అంత పాపులర్‌ కావడానికి కూడా ఆ సినిమాలోని ప్రధాన పాత్రలు సూపర్‌ హీరోస్‌ కావడమే. ఏకంగా సొంత భాషా సినిమాల్ని కూడా వాయిదా వేసుకునేలా చేసింది ఈ డబ్బింగ్‌ సినిమా. అలాంటిది ఈ దారిలో వస్తున్నాడు ఓ తమిళ హీరో. లవ్‌ స్టోరీస్‌తో యూత్‌లో తనదైన క్రేజ్‌ సంపాదించుకున్న జై హీరోగా 'బ్రేకింగ్‌ న్యూస్‌' అనే సినిమా తెరకెక్కుతోంది. ఆండ్రూ ఈ సినిమాకి దర్శకుడు. భానుశ్రీ, దేవ్‌ గిల్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకునే మధ్యతరగతి కుర్రాడు జీవన్‌ పాత్రలో జై కనిపించనున్నాడు ఈ సినిమాలో. ఇల్లు, ఆఫీస్‌.. ఇలా చిన్న గిరి గీసుకుని జీవనం సాగిస్తున్న జై, తన కళ్లెదుట జరుగుతున్న కొన్ని అన్యాయాల్ని సహించలేక ఎదురు తిరగడంతో కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలో ఆయనకు అనుకోకుండా సూపర్‌ పవర్స్‌ వస్తాయి. దాంతో సూపర్‌ హీరోగా మారిపోతాడు.

 

తనకున్న శక్తులతో ఈ భూమిని ఎలా కాపాడాడనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ తరహా సినిమాలంటే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్లకీ అసక్తి బాగానే ఉంటుంది. అందులోనూ ఒకానొక టైంలో ఈ కాన్సెప్ట్‌ బేస్‌డ్‌ మూవీస్‌ వచ్చేవి. కానీ, ఇప్పుడు పెద్దగా ఇలాంటి సబ్జెక్ట్స్‌ని టచ్‌ చేయడం లేదు మన దర్శక నిర్మాతలు. తాజాగా జై హీరోగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS