తమిళతంబీలకు విలనిజం చూపిస్తానంటోన్న ప్రామిసింగ్‌ హీరో.!

మరిన్ని వార్తలు

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో రొమాంటిక్‌ హీరోగా పేరు తెచ్చుకోవడంతో పాటు, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన కత్తిలాంటి కుర్రోడు కార్తికేయ. తొలి సినిమా ఇచ్చిన విజయంతో తర్వాత హీరోగా రెండు సినిమాల్లో నటించాడు. అయితే, ఫలితం డెబ్యూ మూవీ స్థాయిలో రాకపోయినా, ఓకే అనిపించుకున్నాడు. అయితే, హీరోగా ఓ పక్క దున్నేస్తూనే, మరోపక్క తనలోని విలక్షణ నటుడిని బయటికి తీసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా నాని 'గ్యాంగ్‌లీడర్‌' సినిమాలో విలన్‌ అవతారమెత్తాడు. అక్కడా సక్సెస్‌ అయ్యాడు. ఈ విలనిజాన్ని కోలీవుడ్‌ వరకూ విస్తరింపచేయాలనుకుంటున్నాడట. ఈ మధ్య కోలీవుడ్‌ నుండి ఓ బిగ్‌ ఆఫర్‌ కార్తికేయ వద్దకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ సినిమాలో విలన్‌గా కార్తికేయను అనుకుంటున్నారట. అజిత్‌ సినిమాలో విలన్‌ అంటే, ఇంకేముంది, మనోడు ఎగిరి గంతేసేస్తున్నాడు. అయితే, నిజంగానే ఈ ఆఫర్‌ వచ్చిందా.? నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా.. ఆ నిప్పు నిజమేనేమో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. ఒకవేళ నిజమే అయితే, తొలిసారిగా తమిళ తంబీలకు కార్తికేయ పరిచయమవుతున్నట్లన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS