కియారా ఖాతాలో మరో హిట్‌.!

మరిన్ని వార్తలు

'అర్జున్‌రెడ్డి' రీమేక్‌ 'కబీర్‌ సింగ్‌'తో అందాల భామ కైరా అద్వానీ దశ తిరిగిపోయింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో రాకెట్‌ స్పీడులో దూసుకెళ్లిపోతోంది కైరా. 'కబీర్‌ సింగ్‌' తర్వాత కైరా నుండి వచ్చిన సినిమా 'గుడ్‌ న్యూస్‌'. లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పోజిటివ్‌ టాక్‌ దక్కించుకుంది. కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో, కైరా ఖాతాలో బాలీవుడ్‌లో మరో హిట్‌ చేరిపోయింది. అక్షయ్‌ కుమార్‌, కరీనా కపూర్‌, దిల్జిత్‌ దొసాంజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో కైరా అద్వానీ దిల్జిత్‌ దొసాంజాకి భార్యగా నటించింది.

 

స్పెర్మ్‌ ట్రాన్స్‌ఫర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు, తెలుగు ప్రేక్షకుల్నీ ఆకట్టుకునే విధంగా ఉండడం, కైరాకి తెలుగులో ఉన్న క్రేజ్‌తో తెలుగునాట కూడా ఎ సెంటర్స్‌లో బాగానే ఓపెనింగ్స్‌ అందుకుంది 'గుడ్‌న్యూస్‌' మూవీ. రాజ్‌ మెహతా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా హిట్‌తో కైరా అద్వానీ క్రేజ్‌ నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరుకుంది. 'గుడ్‌న్యూస్‌' సక్సెస్‌తో కైరా ఆనందానికి అవధుల్లేవు. ఇకపోతే, 2019లో కైరా తెలుగులో 'వినయ విధేయ రామ' చిత్రంతో తెలుగులో నటించింది.

 

'సీత'గా రామ్‌చరణ్‌ పక్కన చిందేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఈ సినిమా రిజల్ట్‌ బెడిసి కొట్టడం, బాలీవుడ్‌కి చెక్కేయడం, అదే టైమ్‌లో 'లస్ట్‌ స్టోరీస్‌' వెబ్‌ సిరీస్‌తోనూ, 'కబీర్‌ సింగ్‌' సూపర్‌ హిట్‌తోనూ కైరా అద్వానీ కెరీర్‌కి పూల బాటలు పడ్డాయి. ఇక ఇప్పట్లో కైరా కెరీర్‌కి ఢోకా లేదక్కడ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS