షాకింగ్‌: శ‌వాల్ని ఎత్తుకెళ్తున్న కార్తికేయ‌

By Gowthami - February 13, 2020 - 09:46 AM IST

మరిన్ని వార్తలు

యంగ్ హీరోలు ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. క‌థ‌లో, పాత్ర‌లో ఏదో ఓ కొత్త అంశం లేనిదే... సినిమాలు చేయ‌డం లేదు. క‌థ కొత్త‌గా ఉంటే.. ఇమేజ్‌కి స‌రితూగ‌ని పాత్ర అయినా స‌రే, చేయ‌డానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు కార్తికేయ కూడా అదే చేస్తున్నాడు. శ‌వాల్ని ఎత్తుకెళ్తే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. కార్తికేయ కొత్త సినిమా `చావు క‌బురు చ‌ల్ల‌గా` ఈరోజే మొద‌లైంది. గీతా ఆర్ట్స్ 2 సంస్థ నిర్మిస్తున్న చిత్ర‌మిది.

 

బ‌న్నీ వాస్ నిర్మాత. లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో శ‌వాల్ని స్మ‌శానం వ‌ర‌కూ తీసుకెళ్లే వాహ‌నానికి డ్రైవ‌రు పాత్ర‌లో కనిపించ‌నున్నాడు కార్తికేయ‌. అంటే.. అంతిమ సంస్కారాల చుట్టూ న‌డిచే క‌థ అన్న‌మాట ఇది. ఓ వాహ‌నం చుట్టూ, శ‌వాల చుట్టూ క‌థ న‌డుస్తుంద‌ని తెలుస్తోంది. ఇందులో కార్తికేయ పేరు బ‌స్తీ బాల‌రాజు. మ‌రి... పాత్ర కొత్త‌గానే ఉంది. సినిమా ఎలా ఉంటుందో, ఈ పాత్ర‌లో కార్తికేయ ఏ ర‌కంగా విజృంభిస్తాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS