నాగార్జున ప్లానింగ్‌.. ‘సరిలేరు వేరెవ్వరూ..’.?

మరిన్ని వార్తలు

వరుస హిట్స్‌తో ఆల్‌మోస్ట్‌ టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లోకి చేరిపోయాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ప్రస్తుతం ఆయన ఫోకస్‌ అంతా స్టార్‌ హీరోల మీదే. అలాగే స్టార్‌ హీరోస్ సైతం అనిల్‌తో సినిమాలు చేయాలని కుతూహలం చూపిస్తున్న సంగతీ తెలిసిందే. కానీ, అనిల్‌ రావిపూడి ఫోకస్‌ మాత్రం మెగా కాంపౌండ్‌పై ఉన్నట్లు ఆ నోటా ఈ నోటా విన్న మాట. కానీ, ఈ లోగానే మన్మధుడు నాగార్జున అనిల్‌ రావిపూడికి మన్మధ బాణం వేసేశాడనీ తాజా టాక్‌. అఖిల్‌ కోసం అనిల్‌ రావిపూడిని లైన్‌లో పెడుతున్నాడట నాగార్జున. ఎంత ట్రై చేసినా అఖిల్‌కి ఇంతవరకూ సరైన హిట్‌ దక్కడం లేదు.

 

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ని ఏరి కోరి తీసుకొచ్చి అఖిల్‌తో సినిమా చేయిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి ఇప్పటికే. అడిగినంత రెమ్యునరేషన్‌ ఇచ్చి మరీ లక్కీ గాళ్‌ పూజా హెగ్దేని ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా తీసుకొచ్చాడు. ఇంత చేసిన నాగార్జున ఈ సినిమా విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికీ, తదుపరి సినిమా విషయంలో ఇప్పటి నుండే అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఆ క్రమంలోనే ఆయన మెదడులో మెదిలిన డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి.

 

హీరోగా ఇండస్ట్రీలో సత్తా చాటాలంటే, ఓ మాంచి మాస్‌ హిట్‌ పడాల్సిందే. అందుకు అనిల్‌ లాంటి డైరెక్టరే సరైనోడు.. అని భావించిన నాగార్జున తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి, నాగార్జున ప్రపోజల్‌ని అనిల్‌ స్వీకరిస్తాడా.? లేదా.? తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS