పంజాగుట్ట రేప్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనపై 139మంది అత్యాచారం చేశారని, 5 వేలసార్లు రేప్‌కి గురయ్యానని నల్గొండకు చెందిన ఓ దళిత మహిళ పోలీసులకు ఫిర్యాఉ చేయడం... అందులో చాలామంది సెలబ్రెటీలు ముడిపడి ఉండడం దేశ వ్యాప్తంగా షాక్ కి గురి చేసింది. ఆ సెలబ్రెటీల లిస్టులో హాస్యనటుడు కృష్ణుడు పేరు కూడా వినిపించింది. దీనిపై కృష్ణుడు స్పందించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, తనని కావాలని ఎవరో ఇందులో ఇరికిస్తున్నారని, వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కృష్ణుడు స్పష్టం చేశారు.
‘‘ ఒకరిపై ఆరోపణలు చేసే ముందు వారి కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో చూడాలి. లాక్డౌన్ సమయంలో నాకు ఏ ఫోన్ కాల్ రాలేదు. నల్గొండ నుండి ఓ అమ్మాయి నా ఫ్యాన్ అంటూ మాట్లాడింది. నేను ఆమెతో తప్పుగా ఏమీ మాట్లాడలేదు. నాది ప్రేమ వివాహం. నాకూ ఓ కూతురు ఉంది. నేను మహిళలకు ఎంత గౌరవం ఇస్తానో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఈ వ్యవహారం వెనుక ఎవరో ఉన్నారని అర్థమవుతుంది. నాపై ఆరోపణలు చేసే వాళ్లపై నేను చట్టప్రకారం చర్యలు తీసుకుంటాను’’ అన్నారు.