వెర్సటైల్ యాక్టర్, ప్రొడ్యూసర్ మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, సినిమాల్లో ఆయన పేరు మోహన్‌బాబుగా చెలామనీ అవుతున్న సంగతీ తెలిసిందే. ఇప్పుడు మనం ఓ కొత్త విషయం చర్చించుకుందాం. మరో సుపరిచిత నటుడు బాబూ మోహన్ గుర్తున్నాడు కదా. కమెడియన్‌గా, విలన్‌గా, హీరోగానూ తనదైన శైలి నటన కనబరిచిన ఈయన పేరునూ, మోహన్‌బాబు పేరునూ అప్పుడప్పుడూ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. నటులు వేర్వేరు. పేర్లలోనూ డిఫరెన్స్ ఉన్నప్పటికీ, ఒకరి పేరు రివర్స్ చేస్తే మరొకరి పేరు రావడం ఈ ఇద్దరి పేర్లలోనూ ఉన్న ప్రత్యేకత.
ఇద్దరూ సినిమాల్లో అత్యున్నత స్థానాలు అధిగమించారు. రాజకీయాల్లోనూ కీలకంగా రాణించారు. ఇద్దరూ నటులుగానూ, రాజకీయ నాయకులుగానూ మంచి మిత్రులు కూడా. ఇవన్నీ తెలిసిన ముచ్చట్లే. అయితే, తెలియని మరో ముచ్చట ఉంది. వీరిద్దరూ ఒకే రోజు పుట్టారు.. అది మీలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ముచ్చట. వీరిద్దరి బర్త్‌డే ఒకేరోజు కావడం విశేషం. అదీ మార్చి 19 కావడం మరో విశేషం. ఇదే విశేషమైన వార్త ఇప్పుడు సరికొత్తగా చర్చకొచ్చింది. మోహన్‌బాబు, బాబు మోహన్ ఇద్దరూ ఒకే తేదీన జన్మించడం. భలే తమాషాగా ఉంది కదూ లేట్ ఎందుకు.. .ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న ఈ ఇద్దరికీ హ్యాపీ బర్త్ డే చెప్పేయ్యండిక.