అందరం అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలనీ, ప్రపంచం యావత్తూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించాలనీ డాక్టర్ ఎం. మోహన్‌బాబు సూచించారు. మనం దైవాలుగా భావించాల్సిన డాక్టర్లపై, నర్సులపై అక్కడక్కడా కొంతమంది దాడి చేస్తుంటే, మనుషులు ఇంకా మారలేదా.. అనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వైద్యో నారాయణో హరి అన్న మాటను వేదవాక్కుగా భావించాలని మోహన్‌బాబు కోరారు. "పోలీసులు మన రక్షణ కోసం వాళ్ల రక్షణను వదిలిపెట్టి లాఠీలు ఎత్తుతుంటే.. అది మన మీద కాదు, కరోనా వైరస్ మన మీద పాకకుండా ఉండటం కోసం అని గుర్తు పెట్టుకోండి. వారిని గౌరవించండి" అని ఆయన పిలుపునిచ్చారు.