మహేష్ బాబు – రాజమౌళి కాంబో మూవీ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి రోజుకొక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంది. సినిమా పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR సినిమా తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా ఇదే కావటం, మొదటి సారి మహేష్ బాబుతో వర్క్ చేస్తుండటంతో సినిమాపై క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇందులో కోలీవుడ్ సూపర్ స్టార్ విక్రమ్ విలన్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు పూజా కార్య క్రమాలు కూడా మొదలు పెట్టలేదు. ఇన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నా, మూవీ టీమ్ వీటి పై స్పదించటం లేదు. మొదట్లోనే ఇలా మీన మేషాలు లెక్క పెడితే తరవాత సినిమా పరిస్థితేంటి అని మహేష్ ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.
గుంటూరు కారం మూవీ కూడా రిలీజ్ కి చాలా లేట్ అయ్యింది. ఎలాగోలా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అనిపించుకుంది. ఇపుడు జక్కన్న మూవీ కూడా ఇలా లేట్ చేయటం బాగోలేదని ఫాన్స్ అసహనానికి గురి అవుతున్నారు. పైగా రాజమౌళితో సినిమా అంటే మూడేళ్లు పక్కా, ఇంకా లేట్ చేస్తే ఇంకో నాలుగేళ్లు మహేష్ నుంచి ఎలాంటి సినిమా ఉండదని వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
SSMB29 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని, స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిపోయిందని, మ్యూజిక్ వర్క్ కూడా మొదలు పెట్టారని సమాచారం. షూటింగ్ షెడ్యూల్ ఈ ఏడాది లోనే స్టార్ట్ కానుందట. ఈ నేపథ్యం లోనే మహేష్ బాబు ఈ మూవీకి కావాల్సిన శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అది ఎవరి దగ్గర అంటే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి పాన్ ఇండియా యాక్టర్ గా పేరు తెచుకున్న నాజర్ దగ్గరని సమాచారం.
జక్కన్న మహేష్ పాత్రని విభిన్నంగా తెరకెక్కిస్తున్నాడు. అందువల్ల భాష, యాస, హావ భావాలు ఎలా ఉండాలన్న దానిపై సీనియర్ నటుడు నాజర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. నాజర్ మహేష్ కలిసి ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లలో కలిసి నటించారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ చనువు ఇప్పుడు ఇలా కెరియర్ కి ఉపయోగపడింది. ఇంతకు ముందు నాజర్, ప్రభాస్ కి కూడా నటనలో మెళకువలు నేర్పినట్లు తెలిసిందే. మహేష్ లాంటి స్టార్ హీరో నాజర్ దగ్గర మెళకువలు నేర్చుకోవటానికి వెళ్ళటం గొప్ప విషయమే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదే.