టాలీవుడ్ యాంగ్ హీరో రాజ్ తరుణ్, అతని ప్రియురాలు లావణ్య వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. టాలీవుడ్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారాడు రాజ్ తరుణ్. లావణ్య మొదట తనని మోసం చేసాడని, రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పై కంప్లైంట్ చేయటం. వాళ్ళు తనని చంపేస్తా అని బెదిరించినట్లు కూడా చెప్పింది. థ్రెట్ ఉండటం వలనే ఇలా బయటకొచ్చి పోలీసుల్నిఆశ్రయించినట్లు తెలిపింది. నెక్స్ట్ రాజ్ తరుణ్ రివర్సు లో లావణ్య పై కేస్ పెట్టి, నోటీసులు పంపించాడు.
లావణ్య చెప్పేవన్నీ అబద్ధాలని, తనని లావణ్య టార్చర్ చేస్తోందని, అవి భరించలేక తనకు దూరంగా ఉన్నానని పేర్కొన్నాడు. మాల్వీ మల్హోత్రా కూడా మీడియా ముందుకొచ్చి, లావణ్యపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. మళ్ళీ ఇప్పుడు లావణ్య మీడియా ముందుకొచ్చి తన దగ్గర ఉన్న ఆధారాలని చూపుతోంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజ్ తరుణ్ చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని, తనకి తెలిసినంత వరకు 4గురు హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్నాయని, ఆరేళ్ళ క్రితం రిలీజ్ అయిన ఓ మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకుంటే నేను ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఆమె ఆగిపోయిందని లావణ్య చెప్పింది.
రాజ్ తరుణ్ వలలో చాలా మంది పడ్డారని, తమ పెళ్లి గూర్చి చెప్పటంతో వారు అతన్ని వదిలేశారని లావణ్య పేర్కొంది. మాల్వీ మల్హోత్రా మాత్రం తిరిగి తనని బ్లాక్ మెయిల్ చేస్తుందని లావణ్య ఆరోపించింది. నా నుంచి రాజ్ తరుణ్ ని దూరం చేస్తానని చెప్పి మరీ చేసింది. నన్ను జైల్లో పెట్టిస్తా అని చెప్పి పెట్టించింది. ఇప్పుడు చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చింది. అందుకే ప్రాణభయంతో బయటకి రావాల్సి వచ్చింది అని లావణ్య మీడియాతో తెలియజేసింది. అడ్వకేట్ సహాయంతో లీగల్ గా ఫైట్ చేయడానికి రెడీ అయ్యింది. మరి వీటికి రాజ్ తరుణ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.