యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని.. ఈ విషయం చాలాసార్లు నిఖిల్ స్వయంగా చెప్పాడు. జనసేన తరఫున మాట్లాడటం, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్వీట్లేస్తుండడం.. ఇలా వీలు చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటుంటాడు నిఖిల్. అసలు విషయానికొస్తే, సినీ పరిశ్రమ తరఫున కరోనా వైరస్ నేపథ్యంలో విరాళాలు ప్రకటిస్తున్నవారికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో నిఖిల్‌ని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభినందించారు.
పవన్ తనను అభినందించడం పట్ల ఉబ్బితబ్బిబ్బవుతున్న నిఖిల్, పవన్ కళ్యాణ్ మోటివేషన్‌తో ఈ వారంలో తాను మరింత యాక్టివ్‌గా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నాడు. డొనేషన్స్‌ని ఈ వారంలో డబుల్ చేయబోతున్నట్లు చెప్పాడు నిఖిల్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది వాడే మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, ప్రొటెక్ట్ గ్లాసెస్ వంటి వాటిని అందిస్తున్నాడు నిఖిల్. ఈ వారంలో వాటిని డబుల్ చేయబోతున్నాడట నిఖిల్. ఇలాంటి విషయాల్లో నిఖిల్, చాలామందికి స్ఫూ ర్తిగా నిలుస్తుంటాడు. గతంలో ఉత్తరాంధ్రను తుపాను వణికిస్తే, రాత్రికి రాత్రి అక్కడకు చేరుకుని.. బాధితులకు సహాయం చేసేందుకు తనవంతు కృషి చేశాడు.
Thank you PowerStar 🙏🏼 with your motivation i will be doing double the donations this entire week 🙏🏼 #FightAgainstCoronavirus #coronarvirus https://t.co/9cn7TN6jze pic.twitter.com/ondNg6h656
— Nikhil Siddhartha (@actor_Nikhil) March 29, 2020