లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ చాలా కాలం తరవాత మెగాఫోన్ పట్టబోతున్నారు. ఈసారి ఆయన ఓ బయోపిక్ ని ఎంచుకున్నారు. బెంగళూరు నాగరత్నమ్మ అనే నాట్యకారిణి కథని ఆయన తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్టు పనులు మొదలయ్యాయి. బెంగళూరు నాగరత్నమ్మ పాత్ర కోసం కథానాయిక కోసం అన్వేషణ కూడా ప్రారంభమైంది. ఈ పాత్ర సమంతని వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్. అనుష్క, కాజల్ లాంటి పేర్లూ పరిశీలనకు వచ్చినా, సమంత పేరు ఖరారయ్యే ఛాన్సుందని టాక్.
సమంత ఈమధ్య కమర్షియల్ కథలకు దూరంగా, ప్రయోగాలకు దగ్గరగా ఉంది. మజిలీ, యూ టర్న్, ఓ బేబీ లాంటి సినిమాలతో వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తోంది. తనైతే మార్కెట్ పరంగానూ ఈ సినిమాకి క్రేజ్ లభిస్తుందని చిత్రబృందం భావిస్తోంది. కథ కి ఓ పూర్తి స్వరూపం వచ్చాక.. అప్పుడు సమంతని సంప్రదించవచ్చని దర్శక నిర్మాతలు భావిస్తున్నార్ట. సమంత ఓకే అంటే - ఇక ఈ సినిమా పట్టాలెక్కేసినట్టే.