టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి ప్రేమపేరుతో మోసం చేసాడని నార్సింగ్ లో కేస్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చారు. లావణ్య చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే అని కొట్టి పడేసారు. లావణ్య చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఆమెను పెళ్లిచేసుకునే ఉద్దేశం తనకు ఏనాడు లేదని రాజ్ తరుణ్ తెలిపాడు. కావాలనే నన్ను టార్చర్ పెట్టి, కెరియర్ లో ఎదగకుండా నన్ను నాశనం చేయటానికే ఇలా తనపై తప్పుడు కేసులు పెడుతోందని వాదిస్తున్నాడు. త్వరలో తన సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తనని అల్లరి పెట్టేందుకు లావణ్య ఇలా బిహేవ్ చేస్తోందని ఆరోపించాడు.
2014 నుంచి 2017 వరకు లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, ఆమె పద్దతి నచ్చక బయటకు వచ్చేశానని రాజ్‌తరుణ్ పేర్కొన్నాడు. తను డ్రగ్స్ కి బానిస అని, డ్రగ్స్ కి దూరంగా ఉండమని ఎన్ని సార్లు చెప్పినా లావణ్య వినలేదన్నాడు. లావణ్య తనతో ఉంటూనే మస్తాన్ సాయి అనే మరో అతనితో క్లోజ్ గా ఉంటోందని, వారిద్దరికీ ఎలా పరిచయం అయిందో తనకు తెలియదన్నాడు రాజ్ తరుణ్. తన ఫ్లాట్ లోనే వారిద్దరూ ఇప్పుడు ఉంటున్నారని, తాను లీగల్ గా ప్రొసీడ్ అవుతానని తెలిసి, కావాలనే తన కంటే ముందే పోలీసులకు లావణ్య కంప్లైన్ట్ చేసిందని తెలిపాడు.
ఒకసారి డ్రగ్స్ తో పట్టుబడి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వచ్చిందని, ఆమెను భరించలేక విసిగిపోయి లావణ్యని వదిలి వెళ్లిపోయినట్టు రాజ్‌తరుణ్ చెప్తున్నాడు. తానే కావాలంటున్న లావణ్య, మస్తాన్ సాయితో పెళ్లి చేయాలని గుంటూరులో కేసు పెట్టిందని, ఆ కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా తన దగ్గర ఉందన్నాడు. లావణ్యకు తానేమీ చెప్పలనుకోవడం లేదని, లీగల్ ఎడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆమెతో మాట్లాడతానని, తనపై వచ్చిన ఆరోణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. అంతవరకు మీడియా తనకు అండగా నిలబడాలని కోరారు రాజ్ తరుణ్.