బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు సంపాదించింది బిగ్ బాస్ ప్రోగ్రాం. మొదట హిందీలో మొదలైన ఈ షో తరువాత మిగతా భాషల్లో ప్రారంభం అయ్యింది. తెలుగులో ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకుని 8 సీజన్ కి రెడీగా ఉంది. తెలుగులో మొదట ఎన్టీఆర్, నాని, తరవాత నాగార్జున హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో తెలుగు బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యం లో పలువురి కంటెస్టెంట్స్ పేర్లు బయటికి వస్తున్నాయి. సెలబ్రిటీస్ తో పాటు సోషల్ మీడియా స్టార్లు, సింగర్స్, కామన్ మెన్ క్యాటగిరిల వారీగా కంటెస్టెంట్స్ ఉంటారు. ఎక్కువ వివాదస్పద కంటెస్టెంట్స్ కి ఛాన్స్ ఉంటుంది. హౌస్ లో కంటెంట్ కోసం ఇలాంటి వాళ్ళని తీసుకుంటారు.
సీజన్ 8 లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి. నిత్యం వివాదాలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వేణుస్వామి హౌస్ లో ఉంటే కంటెంట్ కి కొదవ ఉండదని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. వేణుస్వామి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలకు జ్యోతిష్యం చెబుతూ ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే కొన్ని వివాదాలు కూడా కొని తెచుకున్నారు. టాలివుడ్ లో ఎవరైనా పెళ్లి చేసుకోగానే వారి విడిపోతారని చెప్పి చివాట్లు తింటుంటారు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని చెప్పి మెగా ఫాన్స్ ఆగ్రహానికి లోనయ్యాడు. ప్రభాస్ కి పెళ్లి అవదని, కెరియర్ బాగుండదని, కూడా చెప్పి ట్రోల్స్ కి గురయ్యాడు.
ఏపీలో మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని, కూటమి ఓడిపోతుందని, పవన్ కి రాజకీయ జీవితం లేదని ఏవో నోటి కొచ్చినట్లు మాట్లాడి, తీరా ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక తప్పు ఒప్పుకుని ఇక నుంచి జోతిష్యం చెప్పనని ప్రతిన బూనాడు. ఇంతటి వివాదాస్పదుడ్ని తీసుకుంటే షో కి తిరుగుండదు అని నిర్వాహకులు సంప్రదించారని, వేణు స్వామి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందుకోసం వేణుస్వామి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.