ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన సోదరి శ్రీలక్ష్మీ కనకాల కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె కాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమె భర్త పెద్ది రామారావు ప్రముఖ పాత్రికేయుడు. శ్రీలక్ష్మికి నటనలో అనుభవం ఉంది. తల్లి దండ్రుల వద్ద నటనలో శిక్షణ తీసుకున్న ఆమె, ఆ తరవాత కొన్ని ధారావాహికలలో నటించింది. రాజశేఖర చరిత్రము, అగ్నిపూలు లాంటి సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. రాజీవ్‌కు శ్రీలక్ష్మితో చాలా అనుబంధం ఉంది. దాంతో సోదరి మరణవార్తను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ లోనే శ్రీలక్ష్మి అంత్య క్రియలు జరగనున్నాయి.