ముద్దుగుమ్మ పూజా హెగ్దే ఇప్పుడు సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా చెలామణీ అవుతోంది. అలాగే బాలీవుడ్ నుండీ ఆమెకు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే కోలీవుడ్‌లోనూ పూజా ఆఫర్ దక్కించుకుందన్న వార్తలు వచ్చినా, వాటిని పూజా హెగ్దే ఖండించింది. అంటే, ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పూజా హెగ్దే సత్తా చాటుతోంది. ఇప్పటికే టాలీవుడ్లో ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోస్తో సూపర్ హిట్స్ కొట్టేసిన పూజా హెగ్దే, ప్రస్తుతం ప్రబాస్‌తో హిట్‌కి రెడీ అవుతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రబాస్, పూజా సినిమా ఆన్ సెట్స్ సంగతి తెలిసిందే. దీంతో పాటు, అక్కినేని కాంపౌండ్ హీరో అఖిల్‌తోనూ పూజా జత కడుతోంది.
ఈ సంగతి అటుంచితే, పూజా హెగ్దే విషయంలో ఓ గాసిప్ వేడి వేడిగా చక్కర్లు కొట్టేస్తోంది. ఓ బాలీవుడ్ యంగ్ హీరోతో పూజా హెగ్దే డేటింగ్ చేస్తోందనేది ఈ గాసిప్ సారాంశం. అయితే, నిజంగానే పూజా హెగ్దే డేటింగ్లో ఉందా.? అనే విషయంపై నెటిజన్స్ క్యూరియాసిటీతో ఆరా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరా తీయడం సంగతేమో కానీ, ఈ గాలి వార్త మాత్రం గుప్పు గుప్పుమంటూ కరోనా కన్నా ఫాస్ట్‌గా స్వైర విహారం చేసేస్తోంది. మరి ఈ గాలి వార్తని పూజా ఖండిస్తుందా.? పోనీలే, కరోనా కాలంలో తనపై ఓ హాట్ న్యూస్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేయనీలే.. అని వదిలేస్తుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.