ఒరేయ్ పండు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సచిన్ జోషి, తను వ్యాపార వేత్త కూడా. ఇప్పుడు ఓ కేసులో ఇరుక్కున్నాడు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సచిన్ జోషిని ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. విజయ్ మాల్యాకు సంబంధించిన కింగ్‌ఫిషర్ విల్లాను ఇటీవల సచిన్ జోషి కొనుగోలు చేశాడు. అయితే ఈ విషయంలో ఓంకార్ రియాల్టీ కేస్, సచిన్ జోషి మధ్య ఆర్థిక లావాదేవీల్లో అవతతవకలు జరిగినట్లు గుర్తించారు.
ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి కూడా ఉన్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను వీరు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు జోషిని పిలిచారు. కానీ.. సచిన్ ప్రతీసారీ.. డుమ్మా కొడుతూనే ఉన్నాడు. దాంతో సచిన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అరెస్ట్ చేసే ముందు.. సచిన్ ని దాదాపు 18 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఏ ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పలేకపోవడం వల్లే.. సచిన్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు టాక్.