ఆదివారం ప్రేమికుల రోజు ముగిసింది. ఈ రోజు కొత్త గా ప్రేమలో పడినవాళ్లు కొంతమంది... ప్రేమని కొత్తగా వ్యక్తం చేసుకున్నవాళ్లు మరికొంతమంది. చిత్రసీమలోనూ... ప్రేమికుల రోజుని ఘనంగా జరుపుకున్నారు. ఈమధ్యే పెళ్లి చేసుకున్న నిహారిక.. సైతం వాలెంటైన్స్ డే.. బాగా సెలబ్రేట్ చేసుకుంది. కాకపోతే... తన భర్త చైతన్యకి బహుమానాలేం ఇవ్వలేదట. తీసుకోనూ లేదట.
''మా ఇద్దరికీ బహుమానాలు ఇచ్చి, పుచ్చుకోవడానికి ప్రత్యేకమైన సందర్భాలు, రోజులు అవసరం లేదు. కాకపోతే.. ఇది వరకే నాకు చైతన్య నుంచి మంచి గిఫ్ట్ వచ్చింది. నా పుట్టిన రోజున ఓ కుక్క పిల్లని కానుకగా ఇచ్చి నన్ను సర్‌ప్రైజ్ చేశాడు. ఇలాంటి సర్‌ప్రైజ్‌లు నాకు అప్పుడప్పుడూ అందుతూనే ఉంటాయి. అయితే తనకు నాకు గిఫ్టులు ఇవ్వడమే గానీ, నేనెప్పుడూ తనకు ఇవ్వలేదు'' అని చెప్పుకొచ్చింది.
తన వైవాహిక జీవితం గురించి చెబుతూ...''చై నాకు ఎప్పటి నుంచో తెలుసు. తన దగ్గర చాలా కంఫర్ట్ గా ఉంటాను. ఎలాంటి భయాలూ ఉండవు. ఓ స్నేహితుడితో జీవితం పంచుకున్నట్టు అనిపిస్తోంది'' అని చెప్పుకొచ్చింది.