సీనియర్ నటుడు శరత్‌బాబు(71) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్లతో భాదపడుతన్న శరత్‌బాబు సోమవారం తుది శ్వాస విడిచారు.
‘రామరాజ్యం’ అనే సినిమాతో శరత్‌బాబు వెండితెరకు పరిచయమయ్యారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. తెలుగులో శరత్‌బాబు చివరగా మళ్ళీ పెళ్లి సినిమా చేశారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా శరత్‌బాబు చెదిరిపోని ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా ఈటివీలో 1977లో వచ్చిన ‘అంతరంగాలు’ సీరియల్ శరత్‌బాబును బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ తర్వాత ‘జనని’, ‘అగ్నిగుండాలు’ సీరియల్స్ కూడా శరత్‌బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శరత్ బాబు మరణం పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు.