శింబు నోట పవన్ పాట

మరిన్ని వార్తలు

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ తాను ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారని తెలిసందే. అవకాశం చూసుకుని ఈ సినిమాలకి డేట్స్ ఇస్తన్నారు. ఈ క్రమంలో పవన్ సుజిత్ కాంబోలో వస్తున్న 'OG' పై భారీ అంచనాలున్నాయి. పవన్ మాటల్లో కూడా OG పై హైపు పెంచారు. పలు సందర్భాల్లో పవన్ OG  బాగుంటుంది . చూద్దురు గాని అని కామెంట్ చేశారు.  ఇంకో 20  శాతం షూటింగ్ పెండింగ్ ఉందని, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని టాక్. OG లో స్టార్ క్యాస్టింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దులవీరుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నాడు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి లాంటి స్టార్లున్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో శింబు  కూడా యాడ్ అయ్యాడు. 


అవును మీరు విన్నది నిజమే శింబు 'OG' లో భాగమయ్యాడు. కాకపోతే నటుడిగా కాదు. సింగర్ గా. శింబు ఇప్పటికే తెలుగులో కొన్ని పాటలు పాడాడు. ఎన్టీఆర్, రామ్, మనోజ్, లాంటి వారికోసం పాట పాడారు శింబు. నువ్వు నా బుజ్జి పిల్ల, బుల్లెట్ బండి సాంగ్స్ శింబుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు మరొకసారి పవన్ కోసం తన గళం విప్పనున్నాడు. OG సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని శింబు పాడారంట. OG లో ఈ స్పెషల్ సింగిల్ కి శింబు గాత్రంతో మ్యాజిక్ చేస్తారని తమన్ ఇలా ప్లాన్ చేశారట. 


సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే సందర్భంగా ఈ సాంగ్ రిలీజ్ చేయాల్సివుండగా, వరదలు కారణంగా పవన్ వాటన్నిటిని వాయిదా వేశారు. లేకపోతె ఈ పాటికి శింబు నోట పవన్ పాట హైలెట్ అయి ఉండేది. పవన్ కోసం శింబు పాట పాడాడనే విషయం తెలియడంతో ఇప్పుడు ఆ సాంగ్ పై మరింత ఆసక్తి పెరిగింది ఫాన్స్ లో. పెండింగ్ షూటింగ్ కోసం విజయవాడలో ముంబై సెట్ వేశారని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ఇదే ఏడాది మూవీ రిలీజ్ చేయాలనీ ప్లాన్  చేస్తున్నారట మేకర్స్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS