అది నేను కాదు అంటున్న శ్రీకాంత్

మరిన్ని వార్తలు

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. అక్కడ పలువుర్ని అరెస్ట్ చేశారు. వీరిలో చాలా మంది టాలీవుడ్ నటీనటులు, మోడల్స్ ఉన్నట్టు సమాచారం. శ్రీకాంత్ రేవు పార్టీలో పట్టుబడ్డాడన్న వార్త  ఊపందుకోవడంతో శ్రీకాంత్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి శ్రీకాంత్ వెళ్లలేదని, ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారని  శ్రీకాంత్ టీమ్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా శ్రీకాంత్‌ వీడియో బైట్‌ కూడా విడుదల చేశారు. 


శ్రీకాంత్ మాట్లాడుతూ ''నేను హైద‌రాబాద్‌లోని మా ఇంట్లో ఉన్నా. బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లిన‌ట్లు, అక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేసిన‌ట్లు ఫోన్లు వ‌చ్చాయి. ఆ వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవ‌టంతో నాకు సంబంధించిన వార్త‌ల‌ను వారు రాయ‌లేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లాన‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్స్ చూశా. ఆ వీడియో ప్రసారం చూసి నేను, మా ఫ్యామిలీ న‌వ్వుకున్నాం. ఇటీవల నాకు, నా భార్య‌కు విడాకులు ఇప్పించారు. ఇప్పుడు ఆ రేవ్ పార్టీకి వెళ్లానన్నారు. ఆ రేవ్ పార్టీలో దొరికిన‌ వ్యక్తి ఎవరో కొంచెం నాలా ఉన్నాడు. అత‌డికి కొంచెం గ‌డ్డం ఉంది. కానీ, ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. అతడిని చూసి నేనే షాక‌య్యా'' అని శ్రీకాంత్ పేర్కొన్నారు. 


రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియ‌దు. మీడియా మిత్రులు స‌హా ఎవ‌రూ న‌మ్మొద్దు. విష‌యం తెలుసుకోకుండా, రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడ‌నే మీరు పొర‌బ‌డి ఉంటార‌ని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మొద్దు అని కోరారు శ్రీకాంత్. తనకి అలా రేవ్ పార్టీల‌కు, పబ్బులకు వెళ్లే అలవాటు లేదని, తనది అలాంటి కల్చర్ కాదని, స్పష్టం చేశారు. తాను హైదరాబాద్ లో తన సొంత ఇంటిలోనే ఉన్నట్లు, ఎక్కడికి వెళ్లలేదని  ఈ వీడియో బైట్ లో చెప్పారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS