స్టూడియో నిర్మాణానికి హీరో రెడీ.

మరిన్ని వార్తలు

టాలీవుడ్ చాలా మంది హీరోలు సినిమాల్లో నటించడమే కాకుండా పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. మహేష్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్ లాంటి హీరోలు పలు వ్యాపారాలలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు. చాలామంది హీరోలు సినిమా నిర్మాణం కూడా చేపడుతున్నారు. తాజాగా యువ నటుడు సుధీర్ బాబు ఒక స్టూడియో నెలకొల్పడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విషయాన్ని సుధీర్ బాబు స్వయంగా వెల్లడించడం విశేషం.

 

సుధీర్ బాబు గతంలో 'నన్ను దోచుకుందువటే' ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ సినిమా భారీ విజయం సాధించలేదు కానీ సుధీర్ బాబుకు నిర్మాతగా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు నిర్మాత నుంచి ఒక స్టూడియో అధినేతగా మారే ప్రయత్నాల్లో ఉన్నారట. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుధీర్ బాబు స్టూడియో కోసం మంచి లోకేషన్ చూస్తున్నామని, అనువైన స్థలం దొరకగానే స్టూడియో నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. సుధీర్ బాబు మామగారైన సూపర్ స్టార్ కృష్ణ హైదరాబాదుకు ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో పద్మాలయా స్టూడియోస్ స్థాపించిన సంగతి తెలిసిందే. కృష్ణ కుమారుడు మహేష్ బాబు పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఎందుకో స్టూడియో నిర్మాణం దిశగా అడుగులు వేయలేదు. ఇప్పుడు సుధీర్ బాబు ఆ దిశగా అడుగులు వేయడం విశేషమే.

 

సుధీర్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'V' రిలీజుకు రెడీగా ఉంది. ఈ సినిమాలో మరో హీరో నాని కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా బ్యాడ్మింటన్ ఛాంపియన్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో కూడా సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS