ప్రముఖ హాస్య నటుడు సునీల్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. గొంతు నొప్పితో సునీల్ బాధ పడుతున్నారని తెలుస్తోంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటీవల షూటింగులలో తీరిక లేకుండా గడపడం వల్ల నీరసించిపోయారని సమాచారం.
ఇది కేవలం రొటీన్ చెకప్ అని, సాయింత్రం సునీల్ డిశ్చార్జ్ అవుతారని ఆయన సన్నిహితులు తెలిపారు. హాస్యనటుడి నుంచి హీరోగా మారిన సునీల్.. ఈమధ్య మళ్లీ హాస్య పాత్రలవైపు దృష్టి పెట్టారు. వరుసగా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇటీవలే అల వైకుంఠపురములో నటించారు. శుక్రవారం విడుదల కాబోతున్న డిస్కోరాజాలోనూ ఆయనకు మంచి పాత్ర దక్కింది.