బ్రేకింగ్ న్యూస్‌: 'RRR' లో రానా.

By Gowthami - January 23, 2020 - 11:10 AM IST

మరిన్ని వార్తలు

అవును... 'RRR' లో రానా నటిస్తున్నాడు. అయితే ఇది రాజ‌మౌళి 'RRR' కాదు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'RRR'. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. 'రాక్ష‌స రాజ్యంలో రామ‌ణాసురుడు' అనే పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రావ‌ణాసురుడిగా రానా క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇదో థ్రిల్ల‌ర్ సినిమా అట‌. ఇప్ప‌టికే క‌థ సిద్ధ‌మైంది. దానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుతోంది.

 

రానాతో పాటుగా ఈ చిత్రంలో మ‌రో క‌థానాయ‌కుడు కూడా న‌టిస్తార‌ని స‌మాచారం. రానా - తేజ కాంబోలో 'నేనే రాజు నేనే మంత్రి' వ‌చ్చింది. ఆ సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. అందుకే వీరిద్ద‌రూ మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేయ‌డానికి చేతులు క‌లిపారు. అయితే ఈ చిత్రానికి RRR ని పోలిన టైటిల్ ఎంచుకోవ‌డ‌మే ఆసక్తిని రేకెత్తిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS