ప్రముఖ నటుడు వినోద్ అస్తమయం

మరిన్ని వార్తలు

ప్రముఖ నటుడు వినోద్ ఇక లేరు.

అందుతున్న వివరాల ప్రకారం, నటుడు వినోద్ ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన స్వగృహంలో బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. ఈ మరణ వార్త తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకునేలా చేసింది.

తెలుగులో దాదాపు 300 కి పైగా చిత్రాలలో నటించిన ఈయన సహాయ పాత్రల్లో మంచి నటుడిగా రాణించారు. ముఖ్యంగా ఆయన - ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్‌, మిర్చి సినిమాలలో చేసిన పాత్రలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక అంత్యక్రియలుకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వినోద్ గారి అకాలమరణానికి www.iQlikmovies.com తరపున నివాళులు అర్పిస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS