స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ఒక కమెడియన్ అరెస్ట్ అవడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నది.

ఆ వివరాల్లోకి వెళితే, జబర్దస్త్ ఫేం హరికి ఎర్రచందనం స్మగ్లర్లకి సంబంధాలు ఉన్నట్టు తేలడంతో వెంటనే చిత్తూరు పోలీసులు ఆయని అరెస్ట్ చేశారట. అయితే ఈమధ్యనే అరెస్ట్ అయిన స్మగ్లర్ల నుండి సేకరించిన సమాచారంతో హరికి ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ కి సంబంధం ఉన్నట్టు తేలిందట.

ఇక ఈ స్మగ్లింగ్ కి పాల్పడుతూ కోట్లాది రూపాయలు వెనకేసిన్నట్టుగా సమాచారం. అలా సంపాదించిన డబ్బుతోనే ఈ మధ్యనే విడుదలైన ఒక చిత్రానికి ఫైనాన్స్ కూడా చేసినట్టు పోలిసుల వద్ద సాక్ష్యాలు ఉన్నాయట.

ఏదేమైనా... అందరిని నవ్వించే కమెడియన్ ఇలా స్మగ్లింగ్ ఆరోపణల పైన అరెస్ట్ అవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS