ఈమధ్య టాలీవుడ్ కి హిట్టు లేని లోటుని `సీతారామం`, `బింబిసార` తీర్చేశాయి. ఈ రెండింటికీ మంచి రివ్యూలు రావడంతో పాటు, వసూళ్లు కూడా జోరుగా వస్తున్నాయి. బింబిసార మాస్ సినిమాగా మిగిలిపోతే, సీతారామం క్లాసిక్ గా మారిపోయింది. సీతారామంతో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రేంజు పెరగడం ఖాయం. అయితే ఈ సూపర్ హిట్ క్లాసిక్‌ని కొంతమంది మిస్ చేసుకొన్నారు.
సీతారామంలో రామ్ పాత్రకు దుల్కర్ మొదటి ఆప్షన్ కాదు. ఈ పాత్ర కోసం ముందు విజయ్ దేవరకొండని సంప్రదించారు. ఈ క్యారెక్టర్ మరీ సాఫ్ట్ గా ఉందని విజయ్ వదులుకొన్నాడు. ఆ తరవాత నాని దగ్గరకి కూడా వెళ్లింది. నాని కూడా అదే కారణంతో ఈ సినిమా చేయలేదు. చివరికి దుల్కర్ ని సంప్రదించడం, తను ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే అనడం జరిగిపోయాయి. సీతగా ఈ సినిమాతో మృణాల్ ఎంట్రీ ఇచ్చింది.
తనకు ఇదే తొలి సినిమా. అయితే ఈ పాత్ర కోసం పూజా హెగ్డేని అనుకొన్నారు. ఆమె భారీ రెమ్యునరేషన్ అడగడంతో... మృణాల్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. తన ఎంపిక తప్పు కాదని మృణాల్ ఈసినిమాతో నిరూపించుకొంది. సీతగా అద్భుతమైన అభినయం ప్రదర్శించింది. పూజా కనుక చేస్తే కాస్త మైలేజీ పెరిగేదేమో. కానీ మృణాల్ చేయడం వల్ల ఈ సినిమాకి ఫ్రెష్ లుక్ వచ్చేసింది.