ఈవారం విడుదలైన రెండు సినిమాలూ (సీతారామం, బింబిసార) హిట్ జాబితాలో చేరిపోయాయి. సీతారామం క్లాస్‌కి నచ్చితే, బింబిసార మాస్‌ని మెప్పించింది. కొన్ని ఏరియాల్లో బింబిసారకు ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల... సీతారామం పై చేయి సాధిస్తోంది. ఓవర్సీస్‌లో మాత్రం సీతారామం దే హవా. ఈ సినిమా తొలి మూడు రోజుల్లో కేవలం ఓవర్సీస్‌లోనే రూ.5 కోట్లు సాధించింది. ఈమధ్య కాలంలో ఓ మీడియం రేంజు సినిమాకి ఓవర్సీస్‌లో ఇన్ని వసూళ్లు దక్కడం ఇదే తొలిసారి.
ప్రీమియర్ షోల ద్వారా సీతారామంకి $91K దక్కాయి. శుక్రవారం 128 వేల డాలర్లు, శనివారం 212 వేల డాలర్లు, ఆదివారం 170 వేల డాలర్లూ సొంతం చేసుకొంది. అలా.. మూడు రోజుల్లోనే 5 కోట్ల వసూళ్లు దక్కాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా శుక్రవారంతో పోలిస్తే శనివారం, శనివారంతో పోలిస్తే ఆదివారం వసూళ్లు బాగున్నాయి. మంగళవారం నేషనల్ హాలీడే. అది ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అవకాశం ఉంది. దాదాపు రూ.45 కోట్ల భారీ వ్యయంతో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. రష్మిక ఓ కీలక పాత్ర పోషించింది.