నటి భావన కిడ్నాప్?!

By iQlikMovies - February 18, 2017 - 12:56 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ హీరోయిన్ భావన ఇవాళ ఉదయం కిడ్నాప్ కి గురైనట్టు సమాచారం అందుతుంది.

అందుతున్న వివరాల ప్రకారం, సినిమా షూటింగ్ ముగించుకొని ఎర్నాకులం నుండి ఇంటికి వస్తున్న భావనను కొంతమంది దుండగులు అడ్డగించి కిడ్నాప్ చేశారు. ఆ సమయంలోనే భావన పై అత్యాచారానికి ప్రయత్నించారట. కిడ్నాప్ చేసిన స్థలం నుండి 25 కిలోమీటర్లు దూరంలో పలారీవోట్టం దగ్గర దింపేశారు.

వెంటనే భావన పోలీసులును ఆశ్రయించి వారి పై కేసు పెట్టింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ నిందితుల్లో ఒకరు భావన దగ్గర డ్రైవర్ గా పనిచేసాడు అలాగే ఇంకొక నిందుతుడు కూడా భావన దగ్గర పనిచేసాడు. పోలీసులు కూడా వెంటనే స్పందించి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకునట్టు తెలుస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS