రణబీర్ కపూర్ తాజా చిత్రం జగ్గా జాసూస్ లో ముఖ్య పాత్ర పోషించిన నటి బిధీశా (30) తన ఫ్లాట్ లో ఆత్మహత్యకి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే, బిధీశా సినిమాల్లోకి అడుగుపెట్టక ముందు టెలివిజన్ లో పలు షోస్ కి హోస్ట్ గా చేసింది. ఆమె యాంకరింగ్ తో పాటుగా స్వతాహాగా గాయని అయిన బిధీశా పాటలు కూడా చాలానే పాడింది.
ఇకపొతే బిధీశాకి ఆమె భర్త నిశీత్ కి తరుచూ గొడవలు జరుగుతుండేవి అని, ఆ క్రమంలోనే తన కూతురు ఆత్మహత్యకి పాల్పడి ఉండొచ్చు అని బిధీశా తండ్రి చెప్పాడు. దీనితో నిశీత్ ని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
బిధీశా మృతితో ఒక్కసారిగా ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు షాక్ కి గురయ్యారు.