బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా ఈ మధ్య శృతిమించిన ఎక్స్‌పోజింగ్‌తో కుర్రాళ్లకు కిర్రాకు పుట్టిస్తోంది. కుర్రాళ్ల సంగతేమో కానీ, నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురౌతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆగ్రహం నెటిజన్లకేనా? తనకూ వస్తుంది. అయినా నా దేహం నా ఇష్టం. కాదనడానికి వారెవరు? కావాలంటే నా అందమైన ఫోటోలను డౌన్ లోడ్ చేసుకుని అందాన్ని ఆస్వాదించండి. అంతేకానీ అనవసరమైన కామెంట్స్ చేసే హక్కు మీకు లేదంటూనే, అమ్మడు ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసేసింది. అజంతా, ఎల్లోరా శిల్పాలున్న మన దేశంలో వాటి అందాల్ని ఆస్వాదిస్తున్నప్పుడు మహిళల అందాన్ని ఆస్వాదిస్తే తప్పేముంది అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ కామెంట్‌తో ఆమె ఇంకెన్ని వివాదాల్లో చిక్కుకుంటుందో తెలీదు కానీ, నెటిజన్లు ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా కానీ తాను మాత్రం ఏం భయపడనంటోంది. ఇలాగే తన హాట్ ఫోటో సూట్స్‌ని విచ్చల విడిగా కొనసాగిస్తాననీ అంటోంది హాట్ బ్యూటీ ఇషా గుప్తా. గ్లామరస్‌గా కనిపించడం అనేది ఓ కళ. ఆ కళని మరింత అందంగా చూపించే ప్రయత్నమే తాను చేస్తున్నానంటోంది. ఏది ఏమైనా ఈ రంగుల ప్రపంచంలో ఎంతో మంది ఇలా విచ్చల విడిగా ఎక్స్‌పోజింగ్ చేస్తేనే చేతి నిండా అవకాశాలతో బిజీ అయిపోయారనీ, అలాంటి వారి బాటలోనే ఇప్పుడు తాను కూడా నడుస్తున్నాననీ అంటోంది ఇషా. అంటే అవకాశాలు దొరికే వరకూ ఇషా ఈ హాట్ అప్పీల్‌ని వదలననీ డైరెక్ట్‌గా చెప్పినట్లే. సో బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ విషయం గ్రహించి, పాపం ఇషాకి ఛాన్సులిస్తే బావుండు!