సూపర్ స్టార్ మహేష్‌బాబు స్పీడును అందుకోవడం ఎవ్వరి వల్లా కావడం లేదు. 'బ్రహ్మూెత్సవం' ద్వారా వచ్చిన ఫెయిల్యూర్‌ని కవర్ చేసేందుకు సూపర్ స్పీడుతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మురుగదాస్‌తో 'స్పైడర్' సినిమాలో నటిస్తున్నాడు మహేష్‌బాబు. ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పక్క కొరటాల శివ కాంబినేషన్‌లో 'భరత్ అను నేను' సినిమా ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. లేటెస్టుగా ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ మహేష్ నుండి రాబోతోంది. ఈ సినిమా లేటెస్ట్‌గా పట్టాలెక్కింది. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలనదగ్గవారిలో అశ్వనీదత్ పేరు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. వైజయంతీ మూవీస్ సంస్థ టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థల్లో ఒకటి. 'దిల్' రాజు సంగతి సరే సరి. వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నారాయన. దిల్ రాజు పట్టిందల్లా బంగారమే. అలాంటి ఈ ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ మహేష్‌బాబుతో సినిమా నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'భరత్ అను నేను' సినిమాకి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుంది. ఇక వంశీ పైడిపల్లి సినిమాకి డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది. ఏది ఏమైనా మహేష్ ఫ్యాన్స్‌కి వరుస పండగలే అని చెప్పాలి.