గ్లామ్‌షాట్‌: హాట్‌ అండ్‌ స్పైసీ ఈషా'గుప్త' నిధి

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ అమ్మడి పేరు మార్మోగిపోతోంది. ఎవరా ముద్దుగుమ్మ అనుకుంటున్నారా.? ఈషా గుప్తా. బాలీవుడ్‌లో హాటెస్ట్‌ బ్యూటీగా పేరున్న ఈషా ఇప్పుడు టాలీవుడ్‌లో పాగా వేయాల్సి వస్తోంది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరవనుందీ హాట్‌ బ్యూటీ. వెరీ లేటెస్టుగా ఈ విషయాన్ని వెల్లడించింది చిత్ర యూనిట్‌.

కాగా ఈషాగుప్తా గ్లామర్‌ టచ్‌ చూడాలంటే ఒక్కసారి కొంచెం పాస్ట్‌లోకి వెళ్లాల్సిందే. అప్పుడు ఈ బ్యూటీ ఆల్రెడీ టాలీవుడ్‌కి పరిచయస్థురాలే అనిపిస్తుంది. సచిన్‌ హీరోగా తెలుగులో వచ్చిన 'వీడెవడు' (తమిళంలో 'యార్‌ ఈవెన్‌') చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించింది. అలాగే ప్రభుదేవా, తమన్నా జంటగా తెరకెక్కిన 'అభినేత్రి' సినిమాలో ఐటెం సాంగ్‌లోనూ మెరిసింది. ఇక బాలీవుడ్‌లో అమ్మడి సంగతి చెప్పనే అక్కర్లేదు. మోస్ట్‌ బిజీయెస్ట్‌ యాక్ట్రస్‌ అన్నమాట.

ఇప్పుడు ఈ భామ చేతిలో నాలుగు పైగానే సినిమాలున్నాయి అక్కడ. అలాంటి ఈషా వినయ విధేయుడి కోసం మళ్లీ టాలీవుడ్‌కి దిగొచ్చిందన్న మాట. అదీ సంగతి. అమ్మడి హాట్‌ అప్పీల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే చరణ్‌ పక్కన చూసెయ్యొచ్చు. ఆలోగా ఇదిగో ఈ పిక్‌ చూసి ఫెస్టివల్‌ చేసుకోండే. పర్‌పుల్‌ కలర్‌ హాట్‌ అండ్‌ మోడ్రన్‌ కాస్ట్యూమ్‌లో ఈషా అందాలు గిలిగింతలు పెట్టిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS