సాయి పల్లవి ఎట్‌ ఏ టైమ్‌ డబుల్‌ ధమాకా.!

By iQlikMovies - December 13, 2018 - 18:35 PM IST

మరిన్ని వార్తలు

మలర్‌ బ్యూటీ సాయి పల్లవి ఒకేరోజు రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని కనువిందు చేయనుంది. తెలుగు, తమిళంలో ఒకేసారి సాయి పల్లవి నుండి రెండు సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగులో శర్వానంద్‌తో నటిస్తున్న 'పడి పడి లేచె మనసు' సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ 21న ఈ సినిమా విడుదల కానుంది. హను రాఘవపూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషన్‌ పోస్టర్స్‌లో సాయిపల్లవి, శర్వానంద్‌ కెమస్ట్రీ ఇరగదీసేశారు.

ఏజ్‌ యూజ్‌వల్‌గా సాయిపల్లవి తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఏకంగా శర్వానంద్‌నే డామినేట్‌ చేసేసింది. ఇదిలా ఉంటే, మరోవైపు సాయి పల్లవి తమిళంలో నటిస్తున్న 'మారి 2' చిత్రం కూడా అదే రోజు విడుదల కానుంది. ధనుష్‌కి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది ఈ సినిమాలో. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి పల్లవి ఊరమాస్‌ క్యారెక్టర్‌ పోషిస్తోంది. ఆటోడ్రైవర్‌ క్యారెక్టర్‌ అది. ఇక డాన్సులు కూడా ఊరమాస్‌ డాన్సులే.

అయితే ధనుష్‌ జోడీలో సాయి పల్లవి ఊరమాస్‌ డాన్సులు కెవ్కుకేక పెట్టించేస్తున్నాయి. ఇలా అటు తమిళంలో మాస్‌ రోల్‌తోనూ, ఇటు తెలుగులో క్లాస్‌ అండ్‌ రొమాంటిక్‌ లుక్స్‌తోనూ ఇరగదీసేస్తున్న సాయి పల్లవి రెండు సినిమాలతోనూ ఒకేసారి రెండు హిట్స్‌ తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS