నటికి మరో నటి సాయం: ‘బిగ్’ హార్ట్

మరిన్ని వార్తలు

వ్యాంప్‌గా పలు చిత్రాల్లో పాపులర్‌ అయిన నటి జ్యోతి. ఇటీవల బుల్లితెరపై ప్రసారం అవుతున్న 'బిగ్‌బాస్‌' షోకి ఎంపికైన సంగతి తెలిసిందే. ఆమె 'బిగ్‌బాస్‌'లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే చెప్పింది. రీల్‌ లైఫ్‌లో వ్యాంప్‌ క్యారెక్టర్స్‌ మాత్రమే చేసే తనలో రియల్‌ లైఫ్‌లో మరో యాంగిల్‌ ఉందనీ, అదేంటో 'బిగ్‌బాస్‌' షో ద్వారా చూస్తారనీ చెప్పింది. ఈ మధ్యనే ఆమె 'బిగ్‌బాస్‌' షో నుండి ఎలిమినేట్‌ అయ్యింది. ఈ షో ద్వారా తాను సంపాదించిన సంపాదనలోంచి 50వేల రూపాయలను మరో నటి అల్లరి సుభాషిణికి ఆర్ధిక సాయం చేసింది. అల్లరి సుభాషిణి పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పాపులర్‌ అయిన నటి. కామెడీ పరంగా తనదో స్పెషల్‌ డిక్షన్‌. దురదృష్టవశాత్తూ ఆమె క్యాన్సర్‌ బారిన పడింది. ఈ మధ్యనే కొద్ది కొద్దిగా కోలుకుంటోంది. ఆ రకంగా సినిమాల్లో అవకాశాలు లేక ఆర్ధికంగా చితికిపోయింది సుభాషిణి. తనకు బిగ్‌బాస్‌ షో ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించుకోకుండా, కష్టాల్లో ఉన్న తోటి నటికి సాయం అందించడం ద్వారా తన పెద్ద మనసు చాటుకుంది నటి జ్యోతి. వేంప్‌ క్యారెక్టర్స్‌ ద్వారా పాపులరైన జ్యోతికి పెళ్లి తర్వాత పలు వివాదాల కారణంగా సినిమాల్లో అవకాశాలు లేక, ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆ టైంలో ఈ 'బిగ్‌బాస్‌' ఆమెకి కొంత ఊరటనిచ్చిందనీ చెబుతోంది. కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించి, వ్యక్తిగత జీవితంలో అత్యంత దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వారు చాలా మందే ఉన్నారు ఇండస్ట్రీలో. అలాంటివారికి ఇండస్ట్రీ అండగా నిలవాలి. వారి టాలెంట్‌కి తగ్గట్లుగా అవకాశాలను ఇచ్చి, ఉపాధి చూపే ప్రయత్నం చేయాలి. జ్యోతి లాంటి వారు వ్యక్తిగతంగా చేసిన సాయమే కాకుండా, ఇండస్ట్రీ తరపున అలాంటి వారికి తగిన చేయూతనందిస్తే, బావుంటుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS