మాజీ హీరోయిన్ కుష్బూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని మేల్ మరువత్తూర్ సమీపంలో కుష్బూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఖుష్బూ కారుని ఓ ట్యాంకర్ అడ్డంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పక్క భాగం నుజ్జునుజ్జయింది. ఈ విషయాన్ని ఖుష్బూ ప్రకటించారు కూడా. అందుకు సంబంధించిన ఫొటోని సైతం సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
అదృష్టం తన వైపు ఉందని, అందరి అభిమానం, దేవుని ఆశీస్సులతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపిన కుష్బూ తెలిపారు. మరువత్తూర్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తమ అభిమాన నటి తృటిలో ప్రమాదం నుంచి తప్పుకోవడంతో.. అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.