వెబ్ సిరీస్‌ల మహిమో, ఏమో... హాట్ కంటెంట్ కి ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. ముద్దులు, హగ్గులు దాటి.. పడక గది శృంగారాన్నీ తెరపై చూపించడానికి దర్శకులు మొగ్గు చూపిస్తున్నారు. ఓటీటీకి అమ్ముకునే ఛాన్సులు ఉండడంతో - హాట్ కంటెంట్ ఇంకాస్త ఎక్కువ అవుతోంది. `కమిట్‌మెంట్` టీజర్లోనూ అది కనిపించింది. లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహించిన చిత్రమిది. తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, అమిత్ తివారీ ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రీకరణ పూర్తయ్యింది. టీజర్ ఈరోజు విడుదల చేశారు.
`లైఫ్ పుట్టిందో సెక్స్‌తో అయినప్పుడు లైఫ్ ఇవ్వడానికి సెక్స్ అడిగితే తప్పేముంది?` `ఏంటే.. ఈ లం*** కొడుకులూ.. ఆడది కనిపిస్తే కాంప్రమైజ్‌లూ, కమిట్మెంట్లూ తప్ప ఇంకేమీ ఆలోచించరా`
-అనే డైలాగులు ఈ టీజర్‌లో వినిపించాయి. ప్రతి ఒక్కరికీ ఓ ఆశ, కోరిక, కల ఉంటుంది. వాటిని నిజం చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. చిత్రసీమలో ఆడది.. ముందడుగు వేయాలంటే కమిట్ కావాల్సిందే.. అనేంతలా పరిస్థితులు మారిపోయాయి. దానికి చాలామంది సిద్ధపడినా, కొంతమంది ఎదురు తిరుగుతున్నారు. ఈ ప్రయాణంలో ఆడవాళ్ల బలాలేంటి? బలహీనతలేంటి? అనే విషయాల్ని దర్శకుడు తెరపై చూపించే ప్రయత్నం చేశాడు.కాకపోతే... కాస్త ఘాటుగా. మరి కమిట్ మెంట్ ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.